దర్శి: దర్శి మండలం లో రామచంద్రాపురంలో శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహణ
Darsi, Prakasam | Apr 12, 2025 దర్శి మండలం రామచంద్రాపురంలో శనివారం శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి, స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.