పెద్దాపురం: సామర్లకోటలో స్వయంభు రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయం నందు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం
కాకినాడ జిల్లా, సామర్లకోటలో స్వయంభు పాండురంగ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం సుమారు 6గం నుండి రుక్మిణి సత్యభామ సమేత పాండురంగ స్వామి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అయోధ్యల రాజేష్ ఆధ్వర్యంలో వేద పండితులు సోమేశ్వర శర్మ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితర ప్రముఖులు స్వామిని దర్శించారు. పాండురంగస్వామి దివ్య కళ్యాణానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.