రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల హాస్పిటల్ గా మార్చాలని ఈనెల 18న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలి: సిపిఎం
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్ గా మార్చి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి, సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 18న జరిగే మహా ధర్నాకు మండల వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై, జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లల పెంటయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు