శ్రీశైలం: మహానంది మండలంలో రోడ్డుపై మొక్కజొన్నల ఆరబోత. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
మహానంది మండలంలో కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెడుతున్నారు. నడిరోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.