రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం పాఠశాల విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం శ్రీ శ్రీనివాస రామానుజన్ మున్సిపల్ హైస్కూల్లో బాలల హక్కులు, రక్షణ చట్టాలపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి విద్యార్థులకు పోక్సో చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. సమస్యల కోసం 15100 హెల్ప్‌లైన్ సంప్రదించాలని సూచించారు.