జడ్చర్ల: పాలమూరు నీళ్ల కోసం కోమటిరెడ్డితోనైనా పోరాడుతా: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ముందుగా పాలమూరుకే నీరందించాలని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపును వ్యతిరేకిస్తూ, పాలమూరు ప్రయోజనాల కోసం తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనైనా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.