మానకొండూరు: లోయర్ మానేరు జలాశయం నుండి నీటి విడుదలను నిలిపివేసిన ఇరిగేషన్ అధికారులు..
లోయర్ మానేరు జలాశయం నుండి నీటి విడుదలను నిలిపివేసిన ఇరిగేషన్ అధికారులు... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని దిగువ లోయర్ మానేరు జలాశయంలోకి ఎగువ నుంచి వస్తున్న నీటి ఇన్స్లో తగ్గుముఖం పట్టడంతో గేట్ల ద్వారా ఆదివారం ఉదయం నీటి విడుదలను ఇరిగేషన్ అధికారులు నిలిపివేశారు. ఎగువ నుంచి మిడ్ మానేరు ద్వారా ఎల్ఎండీకి వస్తున్న ఇన్స్లోలు కూడా పూర్తిగా నిలిపివేశారు. కాకతీయ కాలువ ద్వారా 4వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం ఎల్ఎండీలో 23.387 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్ఎండిలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.