శ్రీశైలం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కొట్టాలచెరువు హెడ్మాస్టర్ వెంకటేశ్వర్
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా సంతోషకరమని నాపై మరింత బాధ్యత పెరిగిందని గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వెంకటేశ్వర్లు అన్నారు.