తాడిపత్రి: తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం: యాడికి లో ఎంపీడీవో వీర్రాజు
యాడికి మండల కేంద్రంతో పాటు, అన్ని గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో వీర్రాజు, ఎంపీపీ ఉమాదేవి అన్నారు. యాడికి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. వృధా చేయకూడదన్నారు. మండల అభివృద్ధిపై కూడా దృష్టి సారించామన్నారు.