కర్నూలు: ఎన్టీఆర్ కాలనీలో రోడ్లపై పశువుల స్వైరవిహారం: అధికారులకు సీపీఎం వినతి
ఎన్టీఆర్ కాలనీలోని 41, 42, 43 వార్డుల్లో పశువుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పశువులను యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు సచివాలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.