కనిగిరి: మైనర్ బాలికలను వెంటపడి వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు: కనిగిరి ఎస్సై టి శ్రీరామ్
కనిగిరి: మైనర్ బాలికలను వెంటపడి వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి ఎస్సై టి శ్రీ రామ్ హెచ్చరించారు. కనిగిరి పట్టణంలోని చింతలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై మంగళవారం బాలికలకు ఎస్సై అవగాహన కల్పించారు. పాఠశాల వెలుపల కాని, పాఠశాలలో కానీ ఎవరైనా వేధింపులకు గురి చేస్తే ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని బాలికలకు ఎస్సై సూచించారు. సైబర్ నేరాలు, లైంగిక నేరాలు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ఎస్సై బాలికలకు అవగాహన కల్పించారు.