కనిగిరి: ప్రభుత్వ వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం: కనిగిరి మున్సిపల్ చఛైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి: రేయనక, పగలన నిరంతరం రోగులకు సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రశంసనీయమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... కరోనా వంటి విపత్కర పరిస్థితులలో రోగులకు ప్రభుత్వ వైద్యులు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు మంచి పేరు వచ్చిందంటే అది వైద్యుల కృషి ఫలితమే అన్నారు. నిరంతరం ఇలాగే వైద్యులు రోగులకు సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు.