కామారెడ్డి: అడ్లూర్‌లో ఘనంగా కోట మైసమ్మ అమ్మవారి ఊరి పండుగ!
కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామంలో కోట మైసమ్మ అమ్మవారి ఊరి పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య జరిగిన ఈ వేడుకల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.