నంద్యాల అర్బన్: నిరాశలో వినాయక విగ్రహ వ్యాపారాలు
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభావం వినాయక చవితి మీద కూడా పడింది. నీటి కొరతతో చిన్న విగ్రహాలనే పూజించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈక్రమంలో చాలామంది భారీ విగ్రహాలను కొనుగోలు చేయడం లేదు.పోటాపోటీగా జరిగే ఈ వేడుకల కోసం నంద్యాల జిల్లాలో వ్యాపారులు నెలల తరబడి కష్టపడి భారీ విగ్రహాలను సిద్ధం చేశారు. అవి అమ్ముడుపోక నష్టపోతున్నారు