జడ్చర్ల: తిర్మలాపూర్లో గ్రామంలో విషాదం గొంతులో పూరీ ఇరుక్కుని యువకుడు మృతి
గొంతులో పూరీ ఇరుక్కుని యువకుడు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజవర్గం రాజాపూర్ మండలంలోని తిర్మలాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్ తిరుమలాపూర్ రాత్రెడ్డి వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. ఇవాళ పొలం దగ్గర తను వెంట తెచ్చుకున్న పూరీలు తింటున్నాడు. మూడవ పూరీ తింటున్న సమయంలో అది గొంతులో ఇరుక్కోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.