ఒంగోలు అర్బన్: 100% స్ట్రైక్ లేట్ తో స్థానిక ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఆదేశాలతో స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. 100% స్ట్రైక్ రేట్ తో కూటమి విజయం సాధిస్తుందని ఎంపీ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశారని ఫేజ్ 2 పనులు 2028 కల్లా పూర్తవుతాయని ఎంపీ అన్నారు. స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.