నాగర్ కర్నూల్: తాడూరులో మహిళా హత్య కేసు మిస్టరీ వీడింది: నిందితుడు అరెస్ట్
నాగర్కర్నూల్ జిల్లా తాడూరులో నాగి బంగారమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేక భీమయ్య అనే వ్యక్తి బంగారమ్మను బొలెరో వాహనంతో ఢీకొట్టి చంపేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.