కొండపి: జరుగుమల్లి మండలం చిరుకురపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ జరుగుపల్లి మండలంలోని చిర్రీకురపాడు గ్రామంలో బుధవారం మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి వాటర్ హెడ్ ట్యాంక్ ప్రారంభించడంతోపాటు సిసి రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారధ్యంలో అంచలంచలుగా రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నట్టు మంత్రి అన్నారు.