పిఠాపురం: జాతీయ లోక్ అదాలత్ 175 కేసులు పరిష్కారం. పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి
పెండింగ్ కేసుల పరిష్కార వేదిక లోక్ ఆదాల కీలకపాత్ర పోషిస్తున్నాయి కాకినాడ జిల్లా పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం కాకినాడ జిల్లా పిఠాపురం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కోర్టుకు వచ్చే కక్షిదారులకు అవగాహన కల్పించారు. పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుని రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చన్నారు. అనంతరం లోక్ అదాలత్‌ల ద్వారా మూడు కోర్టులలో 340 కేసులకు గాను, 175 కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు.