రాప్తాడు: వెంకటాపురంలో శ్రీరామనవమి సందర్భంగా ముత్యాలమ్మ దుర్గమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో శుక్రవారం ఐదు గంటల పది నిమిషాల సమయంలో శ్రీరామనవమి సందర్భంగా ముత్యాలమ్మ దుర్గమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పార్వేట ఉత్సవంలో భాగంగా ముత్యాలమ్మ దుర్గమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరిగిందని అదేవిధంగా నసనకోటలో సీతారాముల కళ్యాణం ఉత్సవంలో కూడా పాల్గొనడం జరిగిందని రాష్ట్రము ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకోవడం జరిగిందని పరిటాల సునీత పేర్కొన్నారు.