కనిగిరి: రాయవరం వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటనలో మృతి చెందిన మోటుపల్లి కి చెందిన ఆరేళ్ల చిన్నారి చైత్ర అంత్యక్రియలు పూర్తి
మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటనలో మృతి చెందిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావడంతో మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలిగండ్ల మండలం మోటుపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి గోపి దేశి చైత్ర మృతి చెందగా డీఎన్ఏ పరీక్షల అనంతరం అధికారులు చైత్ర మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు శనివారం అప్పగించారు. కుటుంబ సభ్యులు చైత్ర మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలను పూర్తి చేశారు.