గుంతకల్లు: హజ్ యాత్రకు వెళుతున్న వారిని గుత్తి ఆర్ఎస్ఎస్ లోని దర్గాలో ఘనంగా సన్మానించిన దర్గా కమిటీ సభ్యులు
గుత్తి ఆర్ఎస్ లోని నాళ్లగడ్డ వీధిలో ఉన్న దర్గాలో హజ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు మంగళవారం దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. దర్గా కమిటీ ప్రెసిడెంట్ ఎండీ రియాజ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎండీ రియాజ్ మాట్లాడారు. హజ్ యాత్ర అనేది ముస్లింల జీవితంలో ఓ మరిచిపోలేని అనుభూతి అన్నారు. ప్రతి ముస్లిం తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలన్నారు.