గిద్దలూరు: మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం
మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేశాడని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసి ప్రజలను జగన్ ఆందోళనకు గురిచేసారన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో అమరావతి రాజధానిగా తీర్మానం చేసి బిల్లు కేంద్రానికి పంపించడం జరిగిందని పార్లమెంటులో ఆమోదముద్ర పొందిన తర్వాత శాశ్వతంగా ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.