మండపేట: మండపేటలో విషపూరితమైన వ్యర్థాలకు నిప్పు...
స్వేచ్ఛగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు...
మండపేట మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్ధాలను తగలబెడుతుంటే దాని నుంచి వచ్చే పొగ కారణంగా చుట్టుపక్కల నివాస ఉంటున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ,ప్లాస్టిక్, ధర్మకోల్, అట్ట పెట్టిలు,ఇలా విషపూరితమైన వ్యర్ధాలకు, నిప్పు పెట్టడంతో దాని నుండి వచ్చే పొగ ఇళ్లల్లోకి చేరి శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు, స్వేచ్ఛగా శ్వాస తీసుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఇలా నిప్పు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.