కొండపి: కొండేపి : జగనన్న 24 క్యారెట్ గోల్డ్: మాజీ మంత్రి సురేష్
తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించగా మాజీ మంత్రి, కొండేపి వైసిపి ఇంచార్జ్ డా. ఆదిమూలపు సురేశ్ పాల్గొని మాట్లాడారు. 'జగనన్న 24 క్యారెట్ గోల్డ్, ఆలోచనా విధానం గొప్పగా ఉంటుంది. దళితుల ఆత్మగౌరవం అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి మనందరి గౌరవాన్ని నిలబెట్టారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందాలంటే జగనన్న మరోసారి సీఎం అవ్వాలి' అని పేర్కొన్నారు.