రాజమండ్రి సిటీ: తూర్పు గోదావరి: వేగవంతం కానున్న జల గ్రిడ్ ప్రాజెక్టు పనులు
తూర్పు గోదావరి జిల్లా జల గ్రిడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. 2.30 లక్షల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెండింగ్ అనుమతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.