శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో నాగులచవితి పర్వదినం. నాగుల కట్ట వద్ద పాలు పోసినా భక్తులు
శ్రావణ శుద్ధ చవితిని పురస్కరించుకుని నాగులచవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్దకు చేరుకుని నాగదేవతలకు పత్తివస్త్రం, యజ్ఞోపవీతం, పుష్పాలతో అలంకరించి పాలతో అభిషేకం చేశారు. అనంతరం నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నైవేద్యంగా సమర్పించారు.మన సంస్కృతిలో నాగసంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీశైలంలోనూ పలుచోట్ల నాగవిగ్రహాలు దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఆలయ ప్రాకారంపై తూర్పువైపున ఉన్న ఆదిశేషుడు, దక్షిణవైపున ఉన్న నాగబంధ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.