శ్రీశైలం: కూతురిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి. వెలుగోడు శివారులో చోటు చేసుకున్న ఘటన
పాములపాడు మండలం కృష్ణనగర్ లోని కూతురిని చూసేందుకు వెళ్తూ ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలానికి చెందిన పెద్ది వెంకటనారాయణ (48) బైక్పై వెళ్తూ వెలుగోడు మోడల్ స్కూల్ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.