శ్రీశైలం: మహానంది మండలంలో ఆసక్తికర ఘటన ఎంపీటీసీలుగా ఎన్నికైన తండ్రి, కూతుర్లు
మహానంది మండలంలో ఎంపీటీసీ స్థానాలకు గాను పోటీచేసిన తండ్రి కూతుర్లు ఇద్దరూ విజయం సాధించారు. సీతారామపురం గ్రామానికి చెందిన బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి, బుడ్డారెడ్డి యశస్వినీ గాజులపల్లి వన్, బుక్కాపురం గ్రామాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇద్దరు విజయం సాధించడంతో మండలంలో ఆసక్తి నెలకొంది. ఎంపీపీ తండ్రా లేక కూతురా అన్న ఆసక్తి ప్రజలలో నెలకొంది.