నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్లో దారుణ హత్య: భార్యతో కలిసి భర్తను చంపిన ప్రియుడు!
నాగర్ కర్నూల్ రామ్నగర్ కాలనీలో మహ్మద్ కరీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య సలీమా బేగంతో కలిసి ప్రియుడు గౌస్ పాషా ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు.