కొండపి: పొన్నలూరు మండలంలోని సంగమేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలో స్కై ప్రాజెక్టుని చేపట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని సంగమేశ్వర స్వామి దేవాలయం పరిసర ప్రాంతాలలోని నిర్మానుష ప్రదేశాలను సోమవారం పోలీసులు స్కై ప్రాజెక్టు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో డ్రోన్ ఎగరవేసి ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు. అలానే బండలాగుడు పోటీలు ఆలయ పరిసర ప్రాంతాలు ఆ ప్రాంతంలోని నిర్మానుష ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు.