దర్శి: తాళ్లూరు ఎస్సీ కాలనీలో మురుగు కాలువల పూడికతీత పనులు..పరిసరాల పరిశుభ్రత పాటించాలి :సర్పంచ్ చార్లెస్ సర్జన్
Darsi, Prakasam | Apr 26, 2025 తాళ్లూరు ఎస్సీ కాలనీలో మురుగు కాలువల పూడికతీత పనులు శనివారం నిర్వహించారు. ఇటీవల గ్రామంలో మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయని పంచాయతీ అధికారుల దృష్టికి ప్రజలు తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన పంచాయతీ సర్పంచ్ పూడిక తీత పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని సర్పంచ్ చార్లెస్ సర్జన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.