నంద్యాల అర్బన్: నంద్యాలలో 3000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
Nandyal Urban, Nandyal | Sep 12, 2026
నంద్యాలలో 3 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ హరిబాబు, మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ తనయుడు ఎన్ఎండీ ఫిరోజ్ పాల్గొని భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు.