సిరిసిల్ల: శ్రీ భీమేశ్వర ఆలయంలో ఘనంగా లక్ష దీపోత్సవం
కార్తీక మాస పర్వదినాల సందర్భంగా శ్రీ భీమేశ్వర ఆలయంలో డిసెంబర్ 8 వరకు సామూహిక దీపోత్సవం జరుగుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమేశ్వర సదన్ పార్కింగ్ ప్రాంగణంలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.