భీమిలి: కొమ్మాదిలో విధ్యుత్ వైర్ల నుండి వస్తున్న మంటలు. సకాలంలో ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన విద్యుత్ సిబ్బంది
మధురవాడ కొమ్మది జంక్షన్ (వికలాంగుల కాలనీ)లో షార్ట్ సర్క్యూట్ తో విద్యుత్ స్తంభం పై కేబుల్ వైర్లు దగ్ధం అవుతున్నాయి. స్థానిక ప్రజలు, వాహనదారులు విద్యుత్ వైర్ల నుండి మంటలు వ్యాపించటంతో భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందచేశారు. విద్యుత్ ప్రమాదం జరగకుండా ఉండేందుకు సిబ్బంది తాత్కాలికంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.