భీమిలి: గుడిలోవలో రూ.99 లక్షలతో పంట కాల్వల పూడికతీత పనులను ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంటా
ఆయకట్టు స్థిరీకరించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చేయడం ద్వారా రైతులకు దన్నుగా ఉంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రూ.7.99 లక్షల వ్యయంతో మండలంలోని గుడిలోవ కాలువ పూడికతీత పనులను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో కాలువల పూడికతీతకు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గంలో పంట కాల్వల నిర్వహణ కింద 15 పూడికతీత పనులకు రూ.99.95 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు.