భీమిలి: అభివృద్ధి పథంలో మధురవాడ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు వెల్లడి
ప్రభుత్వం వారు భవన మరమ్మత్తుల కొరకు 32లక్షల నిధులు మంజూరు చేయటం తో...మధురవాడ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం అధునాతనముగా తీర్చిదిద్దబడింది.విధ్యార్దులకు త్రాగునీటి కొరకు 2లక్షల రూ, వ్యయం తో 2000లీటర్ల ఆర్.ఓ.వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయుట జరిగింది.వసతి గృహంలో 3వ.తరగతి నుండి 5వ తరగతి వరకు స్వతంత్రనగర్ ఆర్.హెచ్.సి. ప్రైమరీ పాఠశాల కు & 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మధురవాడ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 2025-26 విద్యా సంవత్సరం కు షీట్ల ఖాళీల వివరాలు: ఎస్.ఇ.కులము వారికి 115 అని తెలిపారు.