భీమిలి: ప్రస్తుత సిపి వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి తెలుగుశక్తి పార్టీ అధ్యక్షులు బీవీ రామ్
పోలీస్ కమిషనర్ శంకభత్ర బాగ్చీ ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని, అది ఎంత మాత్రం తగదని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ బుధవారం మధ్యాహ్నం భీమిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రస్తుత పోలీస్ కమిషనర్ వల్ల క్రైమ్ రేట్ తగ్గిందని, శాంతి భద్రతలు అదుపు లో ఉన్నాయని అన్నారు. సిపిని మరో రెండేళ్లు కొనసాగించాలి, ఇది ప్రజల అభీష్టం. విశాఖలోని ఒక కీలక తెలుగుదేశం ఎమ్మెల్యే సీపీని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ లో ఈ ఎమ్మెల్యే, వారి అనుచరులు మాఫియాలా తయారయ్యి పోలీస్ స్టేషన్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.