భీమిలి: మధురవాడ 5,6,7 వార్డులలో పూడికలు, వ్యర్ధాలు తొలగింపునకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు
5,6,7వ వార్డులలో ఉన్న కాలువలో పూడికలు వ్యర్ధాలు తొలగింపునకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు శంకుస్థాపన చేసారు. కొమ్మాది నుండి క్రికెట్ స్టేడియం వరకు రోడ్డుకు ఇరువైపులా NH-16 సర్వీస్ రోడ్డులో వున్న కాలువలో పూడికలు మరియు వ్యర్థాలు తొలిగించ వలసిందిగా జోన్2 అధికారులకు సూచించారు. పూడికలు, వ్యర్ధాలు తొలగింపు కొరకు 6.20 కిలోమీటర్లకు 74.50 లక్షల వ్యయంతో పనులు నిర్వహిస్తున్నట్లు జోన్2 కమీషనర్ కనకమహాలక్ష్మి తెలిపారు.