భీమిలి: ఎండాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఏఎమ్ హెచ్ ఓ కిషోర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ యువజన సేవా సంఘం ఎస్సీ కాలనీ యండాడలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎమ్హెచ్ఓ కిషోర్, ఎండాడ పీహెచ్సి డాక్టర్, పాల్గొన్నారు. కిషోర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులే ముద్దు అంటూ నినాదాలు చేసారు. అనంతరం ప్రజలకు పర్యావరణం శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి వార్డు అధ్యక్షులు శెట్టిపల్లి గోపి, జనసేన వార్డు ప్రెసిడెంట్ శేఖర్ శ్రీను, టిడిపి మహిళా అధ్యక్షురాలు శతపతి మంగాదేవి తదితరులు పాల్గొన్నారు.