మెట్పల్లి: జగిత్యాల జిల్లాలో కొత్తగా 35 సీసీ కెమెరాల ఏర్పాటు: పోలీస్ స్టేషన్ కు అనుసంధానం
జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామాల్లో 35 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని పోలీస్ స్టేషన్కు అనుసంధానించారు. నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.