శ్రీశైలం: శ్రీశైలం ముఖద్వారం వద్ద అదుపుతప్పి చెట్లలోకి దూసుకుపోయిన కారు.తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం ముఖద్వారం సమీపంలో బుధవారం ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. యాత్రికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి భక్తులు కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కారులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి కాయలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు