దర్శి: దర్శిలో శ్రీశ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు
దర్శిలో శ్రీశ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు బుధవారం కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి నగరోత్సవం స్థానిక వీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు.