దర్శి: దర్శిలో సాగర్ తాగునీటి పైప్లాన్ లీకేజీ మరమ్మతు పనులు.. వన్ వే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడ్డ వాహనదారులు
దర్శిలో సాగర్ తాగునీటి పైప్లాన్ లీకేజీ మరమ్మతు పనులు మంగళవారం కూడా కొనసాగాయి. దీంతో పోలీసులు వాహనాల రాకపోకలకు వన్వే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇరుకు రోడ్లు, మరమ్మతుల కారణంగా వాహనదారులు కొంత అసౌకర్యానికి గురయినట్లు తెలిపారు. పైప్లాన్ మరమ్మతులు త్వరగా పూర్తయితే వన్వే ట్రాఫిక్ సమస్య తొలగిపోనుందని అధికారులు తెలిపారు.