దర్శి: కూటమి పెద్దలు చెప్పినట్లుగా పోలీసు వ్యవస్థ పని చేస్తుందని ఆరోపించిన దర్శి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వైసీపీ కార్యాలయంలో దర్శి ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్పిన విధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని, వారు చెప్పిన వైసీపీ కార్యకర్తలపై పోలీసు వ్యవస్థ దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు పోలీసు వ్యవస్థ హద్దుల్లో ఉండాలని ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.