మునగాల: రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలు వేయాలి: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో
మునగాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈవో కె.మహాలక్ష్మి పాల్గొన్నారు. రైతులు పంట మార్పిడి పాటించి కంది, మినుములు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని, వ్యవసాయ కార్యాలయంలో సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె సూచించారు.