రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో విద్యార్థుల కోసం న్యాయ అవగాహన సదస్సులు
రాజమహేంద్రవరంలో 'సురక్షిత బాల్యం-బాలల సంరక్షణ'పై అవగాహన సదస్సులు నిర్వహించారు. జడ్జి యార్లగడ్డ శ్రీ లక్ష్మి గారు పోక్సో, న్యాయ సేవాధికార చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమస్యలుంటే 15100 హెల్ప్ లైన్ నెంబరును సంప్రదించాలని సూచించారు.