చండూరు: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడతపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీను మృతి చెందారు. మంగళవారం రాత్రి బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.