రాప్తాడు: అనంతపురం కుమార్ ఆస్పత్రిలో గాయపడిన వైయస్సార్ పార్టీ నాయకులను పరామర్శించిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుమార్ ఆసుపత్రిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నేతలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం లో నెమలివరం గ్రామానికి చెందిన విజయ్ భాస్కర్ సనప గ్రామానికి చెందిన పూజారి గోవిందరాజులు రోడ్డు ప్రమాదంలో గాయపడి కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా కార్యకర్తలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి నుంచి అడిగి తెలుసుకోవడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.