సిరిసిల్ల: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ: డిసెంబర్ 22న తుది జాబితా విడుదల
జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఈ నెల 30 వరకు ఎన్యూమరేషన్ పనులు కొనసాగుతాయి. అభ్యంతరాల పరిష్కారం తర్వాత డిసెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.